Magazines

బాల్య వివాహాల రహిత పంచాయతీలుగా తీర్మానించాలి

1 గంట క్రితం

Panchayats should resolve to become free from child marriages.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

స‌ర్పంచ్ లు, కార్య‌ద‌ర్శుల‌తో మంత్రి సీతక్క

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‌నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం‌చారు.బాలల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, రక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. నవంబర్ 14న ప్రతి గ్రామంలో ‘బాల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ – స‌వాళ్లు, ప్రాధాన్యతలు, కార్యాచరణ ప్రణాళిక’ అనే ప్రధాన అజెండాతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో పిల్లలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. గ్రామస్థాయిలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు గ్రామసభల్లో ఈ అంశాలను సమీక్షించి, అవసరమైన చర్యలను నిర్ణయించాలన్నారు.

బాల్య వివాహాల నిర్మూలనకు తీర్మానాలు

గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశించారు. గత 12 నెలల్లో ఒక్క బాల్య వివాహం కూడా జరగని గ్రామాలను ‘బాల్య వివాహాల రహిత పంచాయతీలు’గా గ్రామసభల్లో తీర్మానం చేయాలని సూచించారు. బాల్య వివాహాల నిరోధంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. పిల్లల జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల విద్య, పోషకాహారం, ఆరోగ్యం, టీకాలు, రక్షిత మంచినీరు వంటి ప్రాథమిక సేవలపై గ్రామసభల్లో చర్చించాలని మంత్రి సూచించారు. పిల్లలకు అవసరమైన సేవల్లో లోటుపాట్లను గుర్తించి, వాటి పరిష్కారానికి తీర్మానాలు చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) లో చేర్చాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్