14 మంది జవాన్లకు గాయాలు
నవతెలంగాణ-చేవెళ్ల
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లవాడ స్టేజీ సమీపంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదా నికి గురైంది. ఎదురు గా వస్తున్న మరో కారును తప్పించే ప్రయత్నం లో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 14 మంది ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. స్థానికులు, జవాన్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ జవాన్లు హైదరాబాద్ నుంచి అల్లవాడ స్టేజీ వరకు డ్రైవింగ్ శిక్షణ కోసం వాహనాల్లో వెళ్తుంటారు. శుక్రవారం సైతం అలాగే వెళ్లారు. అల్లవాడ స్టేజీ సమీపంలో ఒక వాహనం ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ శిక్షణలో ఉన్న హవల్దార్ అవిందర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆయనతో పాటు వాహనంలో ఉన్న మరో 13 మంది జవాన్లు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం షాబాద్ మండలం నాగర్‌గూడ లలిత ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం శంషాబాద్‌లోని ఆర్కానో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుండగా, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.






కామెంట్‌లు (0)