Magazines

పెన్నార్‌లో సీఐటీయూ విజయం

16 నిమిషాల క్రితం

సంగారెడ్డి జిల్లా ​సదాశివపేట
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

​నవతెలంగాణ-సదాశివపేట

సంగారెడ్డి జిల్లా ​సదాశివపేట సమీపంలోని చందాపూర్‌ పెన్నార్‌ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ విజయం సాధించింది. బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుపై సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వి.ప్రవీణ్‌కుమార్‌ విజయం సాధించారు. మొత్తం 92 ఓట్లు పోలవగా, సీఐటీయూకు 47, బీఆర్‌టీయూకు 45 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, పెన్నార్‌ పరిశ్రమ గౌరవధ్యక్షుడు బీరం మల్లేశం మాట్లాడుతూ.. కార్మిక సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న సీఐటీయూపై నమ్మకంతో కార్మికులు విజయాన్ని అందించారన్నారు. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా కార్మికులు న్యాయం వైపు నిలిచి సీఐటీయూను గెలిపించడం అభినందనీయమన్నారు. ఈ విజయాన్ని కార్మికుల విజయంగా అభివర్ణిస్తూ వారికి అంకితం చేశారు. సీఐటీయూ నాయకుడు వి.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు సహకారంతో పెన్నార్‌ కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని, భవిష్యత్తులో మెరుగైన వేతన ఒప్పందం సాధించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, మల్లేశం చారి, మూర్తి, నాగరాజ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్