దక్షిణ మధ్య రైల్వేలో
కొన్ని స్టేషన్లలో అందుబాటులో..
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రైల్వేలో భోలు ఏఐ సేవలు ప్రారంభమ య్యాయి. సమాచార వ్యవస్థలో మరింత ఆధునిక మైన, వేగవంతమైన సమర్థ వంతంగా కృత్రిమ మేధస్సు ఆధారిత భోలు సేవలను చేపట్టా రు. స్వదేశీ రైల్వే ప్రత్యేక ‘యాత్రి లార్జ్ లాంగ్వేజ్ మోడల్’గా వస్తున్నది. కాచిగూడ, మల్కాజి గిరితో పాటు కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కామారెడ్డితో పాటు నిజామా బాద్ స్టేషన్లకూ భోలు ఏఐ సేవలు విస్తరించాయి. దక్షిణ మధ్య రైల్వే 2026 మే నెలలో కాచిగూడ, మల్కాజిగిరి రైల్వే స్టేషన్లలో స్మార్ట్, ఇంటరాక్టివ్, బహుభాషా సహాయక వ్యవస్థల ద్వారా ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగు పరిచే లక్ష్యంతో, నెక్స్ట్ జనరేషన్ ఏ.ఐ -ఆధారిత ప్రయాణీకుల సమాచార సహాయ కులైన భోలు మినీ భోలు మాక్స్ లను ప్రవేశపెట్టింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, రైల్వే ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానాలు అందిం చేందుకు ప్రత్యేకంగా రూపొందిం చిన స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్.ఎల్.ఎమ్) అయిన యాత్రి ఎల్.ఎల్.ఎమ్ ను దక్షిణ మధ్య రైల్వే తాజాగా అందుబాటు లోకి తీసుకొచ్చింది. ఈ చొరవ భోలును ఒక ఏ.ఐ ఆధారిత విచారణ కియోస్క్ నుంచి. సహజ భాషలో ప్రయాణీకుల ప్రశ్నలను అర్థం చేసుకోగల, సంబంధిత రైల్వే సమాచారాన్ని మరింత సమర్థవంతంగా అందించగల ఒక ప్రత్యేకమైన రైల్వే కృత్రిమ మేధస్సు సమాచార వేదికగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో కాచిగూడ, మల్కాజిగిరి స్టేషన్లతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కర్నూలు సిటీ,గద్వాల్ , మహబూబ్‌నగర్, కామారెడ్డి, నిజామాబాద్ అనే ఐదు ప్రధాన స్టేషన్లకు అధునాతన భోలు ఏ.ఐ వ్యవస్థను ఇప్పుడు విస్తరించారు. ప్రయాణీకుల సంభాషణలు కూడా ప్రారంభ దశలో సుమారు 200 మంది వినియోగదారుల నుంచి రోజుకు 2,000 కంటే ఎక్కువ మంది ప్రయాణీకుల సంభాషణలకు పెరిగాయి, ఇది పది రెట్లు పెరుగుదలను సూచిస్తుంది.
దక్షిణ మధ్య రైల్వేలో కృత్రిమ మేధ (ఏ.ఐ) ఆధారిత వాయిస్ సదుపాయంతో కూడిన ప్రయాణికుల సేవలను ప్రవేశపెట్టి, భారతీయ రైల్వేలోనే రైల్వే స్టేషన్లను ఏ.ఐ -స్నేహపూర్వక స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్న తొలి జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే నిలిచింది.
సాధారణ సందేహాల కోసం విచారణ కౌంటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, అలాగే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మొదటిసారి ప్రయాణించేవారు. దివ్యాంగులు, డిజిటల్ అప్లికేషన్ల వినియోగంపై అవగాహన లేని ప్రయాణికులకు రైల్వే స్టేషన్లలో రాకపోకలను సులభతరం చేయడమే భోలు లక్ష్యం. భోలు సేవలు ప్రస్తుతం రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. భోలు మినీ ఒక కాంపాక్ట్, వాయిస్ ఆధారిత అసిస్టెంట్ కాగా, భోలు మాక్స్ వాయిస్ ద్వారా పరస్పర సంభాషణతో పాటు టచ్‌స్క్రీన్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.
ప్రాథమిక విచారణ సేవలకు మించి ఈ క్రింది అధునాతన సదుపాయాలతో భోలు సరికొత్త రూపం
1. వాస్తవ సమయ ప్రాతిపదికన రైలు సమాచార బోర్డ్: రైలు నడుస్తున్న స్థితి మరియు రాక/బయలుదేరే వివరాలతో సహా, వాస్తవ సమయ ప్రాతిపదికన రైలు సమాచారం.
2. రైళ్ల వివరాలు, బెర్తుల లభ్యత తెలుసుకోవడం: ప్రయాణీకులు రైళ్ల కోసం శోధించడానికి మరియు సీటు/బెర్త్ లభ్యతను సౌకర్యవంతంగా తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తుంది.
3. కోచ్‌ల స్థాన వివరాలు: ప్రయాణికులు తమ కోచ్ ప్లాట్‌ఫారంపై ఎక్కడికి వచ్చే అవకాశముందో ముందుగానే తెలుసుకునే సదుపాయం.
4. టేక్‌అవే క్యూఆర్ కోడ్ సౌకర్యం: ప్రయాణీకులు కియోస్క్‌పై ప్రదర్శించబడిన క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి, తమ స్మార్ట్‌ఫోన్‌లలో సంబంధిత మార్గదర్శకాలను మరియు కోచ్-స్థాన సమాచారాన్ని పొందవచ్చు మరియు తమ ప్లాట్‌ఫారమ్‌ల వైపు వెళ్లేటప్పుడు ఆ సమాచారాన్ని తమతో పాటు తీసుకువెళ్లవచ్చు
5. సమగ్ర స్టేషన్ అందుబాటును ప్రదర్శించే మార్గదర్శక పటాలు(మ్యాప్ లు) : స్టేషన్ అమరిక, ప్లాట్‌ఫారమ్ అనుసంధానం మరియు ముఖ్యమైన ప్రయాణీకుల సౌకర్యాల స్థానాన్ని ప్రదర్శించే ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్ పటాలు.
6. స్టేషన్‌లో అందుబాటులో ఉన్న ప్రయాణికుల సౌకర్యాల వివరాలు : మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, ఆహార విక్రయ కేంద్రాలు, వెయిటింగ్ హాల్స్, పాదచారుల వంతెన(ఎఫ్. ఓ. బి లు ), లిఫ్టులు, ఎస్కలేటర్లు , ఇతర ప్రయాణీకుల సౌకర్యాల గురించిన సమాచారం.






కామెంట్‌లు (0)