మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సోనియా గాంధీ జీవిత ప్రయాణం త్యాగానికి నిలువెత్తు నిదర్శనమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంపై మంత్రి మాట్లాడారు. సోనియా గాంధీ జీవిత ప్రయాణం, ప్రేమ, కుటుంబ అనుబంధాలు, త్యాగాలు, దేశంతో ఆమెకు ఏర్పడిన ఆత్మీయ బంధాన్ని ఆ పుస్తకం ఆవిష్కరించిందని తెలిపారు. "కొన్ని జీవితాలు చరిత్రలో నిలిచిపోతాయి.. మరికొన్ని జీవితాలు కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపో తాయి. సోనియాగాంధీ జీవితం రెండిం టికీ నిలువెత్తు నిదర్శనం" అని పేర్కొ న్నారు. దేశం ఆమెకు కేవలం నివసించే నేలగా కాకుండా, తన జీవితంలో విడదీయరాని భాగంగా మారిందని తెలిపారు. జన్మభూమి వేరైనా, దేశాన్ని తన మాతృభూమిగా భావించి, ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలను సంపాదించుకున్న ఆమె జీవితం దేశం పట్ల ప్రేమకు, నిబద్ధతకు గొప్ప ఉదాహరణ అని కొనియాడారు.






కామెంట్‌లు (0)