Magazines

సీఎస్‌‌ను కలిసిన ఆర్టీసీ ఎండీ

19 నిమిషాల క్రితం

RTC MD
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఆర్టీసీ నూతన వైస్ చైర్మెన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును మర్యాద పూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ సంస్థ ప్రస్తుత పరిస్థితి, సంస్థ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన, సంస్థను మరింత బలోపేతం చేసే చర్యలు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో అభిప్రాయాలను పంచుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్