దూనీచంద్, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఉపాధ్యక్షులు
సారంపల్లి మల్లారెడ్డి నగర్(నల్లగొండ) నుంచి నవ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
మోడీ పాలనలో దేశంలో ఆదివాసీలపై తీవ్ర దాడులు జరుగుతున్నాయని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఉపాధ్యక్షులు దూనీచంద్ తెలిపారు. నల్లగొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్‌లో బుధవారం ముగిసిన ఏఐకేఎస్ మహాసభలో ఆయన సౌహార్ద సందేశాన్నిచ్చారు. త్రిపుర, బెంగాల్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, తెలంగాణ, తదితర రాష్ర్టాల్లో అడవుల సంరక్షణ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి గెంటేస్తున్నారని వాపోయారు. ఖనిజ వనరులను దోచిపెట్టడంలో భాగంగా కార్పొరేట్లకు అడవులను కట్టబెడుతున్న తీరును ఎండగట్టారు. భూమి, రైతాంగ హక్కుల కోసం ఏఐకేఎస్ పోరాటాల్లో పాలుపంచుకుంటామని తెలిపారు. దేశంలో ఐక్యపోరాటాలు బలపడాలని ఆకాంక్షించారు. పోరాటాల ఖిల్లా నల్లగొండ
స్కైలాబ్‌బాబు, దళిత్ శోషణ్ ముక్తి మంచ్ కార్యదర్శి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పురిటిగడ్డ నల్లగొండ పోరాడి విజయం సాధించే మార్గాన్ని చూపుతుందనీ, ఈ మహాసభ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు బలపడాలని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు ఆకాంక్షించారు. అఖిల భారత కిసాన్ సభ సంపూర్ణ మద్దతు, బలంతో దేశంలో బలమైన వామపక్ష ఉద్యమాన్ని నిర్మిస్తామనీ, సామాజిక న్యాయాన్ని కాపాడుతామనీ, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఓడిస్తామని తెలిపారు. సమానత్వం, లౌకికవాదంతో కూడిన దేశ నిర్మాణం కోసం కృషి చేస్తామని చెప్పారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, యువత, మహిళలు ఐక్యపోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.





కామెంట్‌లు (0)