Magazines

భూహక్కుల పరిరక్షణకు ప్రత్యేక ఉద్యమాలు

14 నిమిషాల క్రితం

rights
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 4 నిమిషాల చదవడం

కరువు బాధిత రైతులకు తక్షణం పరిహారం అందాలి

ఉపాధి హామీ కింద 200 రోజుల పని.. రోజుకు రూ.700 కూలి ఇవ్వాలి : ​అఖిల భారత కిసాన్‌ సభ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజూ కృష్ణన్‌


నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​​రైతాంగ హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సంక్షోభాల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పోరజూాలను మరింత ఉధృతం చేస్తామని నూతనంగా ఎన్నికైన అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అధ్యక్షులు అశోక్‌ ధావలే, ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ తెలిపారు. ​రైతుల భూములు, అటవీ భూములు, పోడు భూముల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ఉద్యమాలు చేపట్టాలని మహాసభ నిర్ణయించిందన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో వేలాది ఎకరాల భూముల నుంచి రైతులను బలవంతంగా ఖాళీ చేయించే చర్యలను వ్యతిరేకించాలని తీర్మానించా మని తెలిపారు. ​నల్లగొండ జిల్లా కేంద్రంలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్‌ గుండగోని మైసయ్య కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధావలే మాట్లాడుతూ తెలంగాణ కిసాన్‌ సభ, మహాసభ ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించిన 36వ అఖిల భారత మహాసభ విజయవంతమైందన్నారు. 1946-51 మధ్య సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరా టానికి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు ప్రధాన కేంద్రాలుగా నిలిచాయని గుర్తుచేశారు.

అటువంటి చారిత్రాత్మక పోరాటాల గడ్డపై జాతీయ మహాసభ నిర్వహించుకోవడం గర్వంగా ఉంద న్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొన్నారని, రైతాంగ సమస్యలు, ఉద్యమ అనుభవాలు, భవిష్యత్‌ కార్యాచరణపై మహాసభ విస్తృతంగా చర్చించిందని చెప్పారు. ​తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో రైతులు తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ధావలే తెలిపారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సహాయం అందించడం లేదని విమర్శించారు. కరువు, ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన 342 జిల్లాల రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.​ ఆహార పంటలకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున కనీస నష్టపరిహారం చెల్లించాలని కోరారు. దేశవ్యాప్తంగా ​2020-21లో రైతులు ఏడాది పాటు సాగించిన చారిత్రాత్మక ఉద్యమం ఫలితంగానే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందని ధావలే గుర్తుచేశారు.

అయినప్పటికీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, పంటల బీమా, రైతులకు పెన్షన్‌, విద్యుత్‌ సమస్యల పరిష్కారం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు. విత్తన బిల్లు, విద్యుత్‌ సవరణ బిల్లులతో పాటు విదేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగి స్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేసి, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించి, రోజుకు కనీసం రూ.700 కూలి చెల్లించాలని కోరారు. పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య, మల్లు స్వరాజ్యం వంటి మహా నేతలు నిర్మించిన పోరాట వారసత్వాన్ని కొనసాగి స్తామని స్పష్టం చేశారు.

​​రైతాంగ ఉద్యమానికి నూతన దిశానిర్దేశం : ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌

నల్లగొండలో నిర్వహించిన 36వ జాతీయ మహాసభ దేశ రైతాంగ ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేసిందని ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ తెలిపారు. ​రైతుల ఆదాయ భద్రత, వ్యవసాయ రంగ పరిరక్షణ, వ్యవసాయ కార్మికుల ఉపాధి హక్కుల సాధన కోసం రైతులు, కార్మికులు, ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలను బలోపేతం చేయాలని మహాసభ నిర్ణయించిందన్నారు. ​రైతాంగ సమస్యల పరిష్కా రం కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఈ నెల26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని మహాసభ నిర్ణయించిందని తెలి పారు. ​ సమగ్ర పంటల బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ​

డిసెంబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలో లక్షలాది మంది కార్మికులతో నిర్వ హించే పోరాటాలను విజయ వంతం చేయాలని మహాసభ నిర్ణయించిందని తెలిపారు. ఆలుగడ్డ సాగు చేస్తున్న రైతులపై పెప్సికో సంస్థ నమోదు చేసిన కేసులను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని తీర్మానించిన‌ట్టు చెప్పారు. రైతులు, కార్మికుల సమ స్యలపై ఉమ్మడి పోరాటాలను ముందుకు తీసుకెళ్తా మని స్పష్టం చేశారు. ఏఐకేఎస్‌ స్థాపన దినోత్సవ మైన ఏప్రిల్‌ 11 నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక పోరాట నిధి సేకరణ చేపట్టాలని మహాసభ నిర్ణయిం చిందని విజ్జు కృష్ణన్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, తీగల సాగర్‌, ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కందాల ప్రమీల, ఎం. శోభన్‌, రైతు సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

​​27 మందితో జాతీయ కార్యాలయ బాధ్యుల కమిటీ

​మహాసభలో ఏఐకేఎస్‌ నూతన నాయకత్వాన్ని ప్రతినిధులు ఎన్నుకున్నారని విజూకృష్ణన్‌ వెల్లడించారు. జాతీయ అధ్యక్షులుగా డాక్టర్‌ అశోక్‌ ధావలే, ప్రధాన కార్యదర్శిగా విజ్జూ కృష్ణన్‌, ఆర్థిక కార్యదర్శిగా పుష్పేంద్ర త్యాగీ ఎన్నికయ్యారని తెలిపారు. 12 మంది ఉపాధ్యక్షులు, 12 మంది సంయుక్త కార్యదర్శులతో కలిపి మొత్తం 27 మందితో జాతీయ కార్యాలయ బాధ్యుల కమిటీ ఏర్పాటైందన్నారు. అఖిల భారత కిసాన్‌ కౌన్సిల్‌కు 167 మంది, కేంద్ర కిసాన్‌ కమిటీకి 86 మంది సభ్యులను ఎన్నుకున్నట్టు వివరించారు.​ తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు చెందిన పోతినేని సుదర్శన్‌ (తీగల సాగర్‌), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికయ్యారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేంద్ర కిసాన్‌ కమిటీలో స్థానం పొందారని వెల్లడించారు.


ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు పిలుపు

​​ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై మహాసభ ఆందోళన వ్యక్తం చేసిందని విజూ కృష్ణన్‌ తెలిపారు. ఈ ప్రక్రియతో కోట్లాది మంది ఓటర్ల హక్కులకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు పోరాడాలని నిర్ణయించింద న్నారు. మతోన్మాదం, కుల వివక్ష, మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చినట్టు వివరించారు. రైతాంగ ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, కార్పొరేట్‌ శక్తుల ఆధిపత్యం నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్