Magazines

లంచం తీసుకుంటూ పట్టుబడిన ‘ప్రజాప్రతినిధి’

10 నిమిషాల క్రితం

‘People’s representative’ caught taking a bribe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

మహబూబాబాద్ జిల్లా 
మోదుగడ్డ తండా సర్పంచ్ అరెస్టు

​నవతెలంగాణ – మరిపెడ

​మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగడ్డ తండా సర్పంచ్ ధరావత్ వీరు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఖమ్మంలోని ఫిర్యాదుదారు కార్యాలయంలో ఆయన డిమాండ్ చేసిన మొత్తం రూ.13 లక్షల లంచంలో తొలి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విచారణలో భాగంగా, గ్రానైట్ గనుల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు, అలాగే ఆయా సంస్థల వ్యాపారం నిరంతరంగా సాగేందుకు సహకరిస్తానని చెప్పి సర్పంచ్ తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. అనంతరం దానిని రూ.13 లక్షలకు తగ్గించారు. ఈ నేపథ్యంలో మొదటి విడతగా రూ.2 లక్షలు బాధితుని తీసుకుంటుండగా సర్పంచ్‌‌ను అధికారులు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను వరంగల్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారు వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి లంచం స్వీకరిస్తూ పట్టుబడటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధి అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్