Magazines

ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్ ధావలే, విజూకృష్ణన్

15 నిమిషాల క్రితం

AIKS
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి

ఆఫీస్ బేరర్లుగా 27 మంది

86 మందితో సీకేసీ, 167 మందితో ఏఐకేఎస్ కేంద్ర కమిటీ ఏర్పాటు

సారంపల్లి మల్లారెడ్డి నగర్ నుంచి 
నవ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్ ధావలే, విజూ కృష్ణన్, కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి ఎన్నికయ్యారు. నల్లగొండలోని సారంపల్లి మల్లా రెడ్డి నగర్ లో నాలుగు రోజులపాటు కొనసాగిన ఏఐకేఎస్‌ 36‌వ మహాసభ బుధవారం స్ఫూర్తి దాయకంగా ముగిసింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మొత్తం 167 మందితో ఏఐకేఎస్ జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో నుంచి 86 మందితో సెంట్రల్ కిసాన్ కౌన్సిల్ (సీకేసీ)ను ఏర్పాటు చేశారు. 27 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా హన్నన్ మొల్లా, అమ్రారామ్, ఈపి జయరాజన్, అమాల్ హల్దార్, ఏం. విజయ్ కుమార్, ఎస్.కే. ప్రీజా, ఇంద్రజిత్ సింగ్, జితేందర్ చౌదరి, బాదల్ సరోజ్, వినోద్ కుమార్, ముక్తుసింగ్, డి.రవీందర్ కొనసాగనున్నారు. సంయుక్త కార్యదర్శులుగా పి. కృష్ణ ప్రసాద్, అవదేశ్ కుమార్, మరియం ధావలే, కెఎన్ బాలగోపాల్, వల్సన్ పనోలి, అజిత్ నావలే, రతన్‌దాస్, పరేష్పాల్, టీ.సాగర్, పోతినేని సుదర్శన్, స్వామి నటరాజన్, ప్రభాకర్ రెడ్డి ఉండనున్నారు. తెలంగాణ నుంచి ఏఐకేఎస్ కేంద్ర కమిటీలోకి 8 మంది ఎన్నికయ్యారు. వీరిలో టీ సాగర్, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, బి రాంబాబు, పి.జంగారెడ్డి, కందాల ప్రమీల, మూడ్ శోభన్ ఉన్నారు. సీకేసీ లోకి టీ.సాగర్, పి.సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి నూతనంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏఐకేఎస్ కేంద్ర కమిటీలోకి ఐదుగురిని ఎన్ను కున్నారు. అందులో ప్రభాకర్ రెడ్డి, వి.కృష్ణయ్య, సూర్యనారాయణ, ఏం.హరిబాబు, బి బలరామ్ ఉన్నారు. వీరిలో నుంచి సీకేసీలోకి ప్రభాకర్ రెడ్డి, కృష్ణయ్య, ఎం హరిబాబును తీసుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్