నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎన్నికల అబ్జర్వర్, కో ఆర్డినేటర్ గా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని రఘుని నియమించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు స్ట్రాటజీ, వార్ రూం ఇంచార్జిగా ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లను నియమించారు. ఉమ్మడి జిల్లాల వారీగా హైదరాబాద్ - సురభి, మతీన్, బండారి మహేందర్ ముదిరాజ్, రంగారెడ్డి - అర్చనా సేనాపతి, మహబూబ్ నగర్ - రంజిత్ గొంగళ్లకు బాధ్యతలు అప్పగించారు.






కామెంట్‌లు (0)