Magazines

పట్టభద్రుల ఓటర్ల నమోదు పారదర్శకంగా జరగాలి

5 రోజుల క్రితం

must be conducted transparently.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తే చట్టరీత్యా చర్యలు : 
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ-సిటీబ్యూరో

​పట్టభద్రుల ఓటర్ల నమోదు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తే వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియపై మల్కాజిగిరి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి

శుక్రవారం ఆయన సమీక్షించారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు సజావుగా జరుగుతుందా..? లేదా..? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ పరిశీలనలో బీఎల్‌ఓలకు ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి పొరపాట్లకూ తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. దరఖాస్తుదారులు సమర్పించిన ఫారం 18, డిగ్రీ సర్టిఫికెట్, తత్సంబధమైన ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఓటరుగా నిర్ధారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఆర్డీఓ శ్యాంప్రకాష్, అల్వాల్ తహశీల్దార్‌ రాములు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్