Magazines

లెక్కే లేదు!

4 గంటల క్రితం

Environmental problem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 3 నిమిషాల చదవడం

సర్కారుకు అందని ప్రయివేటు స్కూళ్ల ఆడిట్‌ రిపోర్టులు

13,677 స్కూళ్లలో ఇచ్చింది 739 పాఠశాలలే..

షోకాజ్‌లతో సరిపెడుతున్న విద్యాశాఖ

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌

వచ్చే ఏడాదీ ఫీజుల నియంత్రణ లేనట్టే?
ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల లొల్లి సర్వసాధారణంగా మారింది. 
ఆ క్షణానికి యాజమాన్యాలను, ప్రభుత్వాలను తిట్టిపోసి, ఎక్కడో దగ్గర అడ్జెస్ట్‌ అయిపోవడం ఆనవాయితీగా మారింది. పేరెంట్స్‌ సంఘాలు 
ఎన్ని ఆందోళనలు, ప్రభుత్వంతో ఎన్ని సంప్రదింపులు జరిపినా, కంటితుడుపే తప్ప, ఫీజుల నియంత్రణ సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. అసలు ప్రభుత్వ ఉత్వర్వులను ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నా, ఎందుకు ఉపేక్షిస్తున్నారనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి విద్యాశాఖను అత్యంత ప్రతిష్టాత్మకంగా తనవద్దే ఉంచుకుని, సంస్కరణల కోసం తాపత్రయపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫీజలు నియంత్రిస్తామని పేరెంట్స్‌ కమిటీలకు గతంలో హామీలు ఇచ్చారు.

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

ఫీజుల నియంత్రణ కోసం యాక్షన్‌ప్లాన్‌ రూపొందించి, అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. దానితో 1994 జనవరి 1వ తేదీ నాటి జీవో ఎమ్‌ఎస్‌ నెంబర్‌-1 ఎడ్యుకేషన్‌ (పీఎస్‌-2) ప్రకారం రాష్ట్రంలోని మూడేండ్ల ప్రయివేటు పాఠశాలల స్థాపన, నిర్వహణ, ఫీజుల నియంత్రణ, వార్షిక ఆర్థిక ఆడిట్‌ నివేదికలను చార్టెడ్‌ అక్కౌంటెంట్‌ అటెస్టేషన్‌తో సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈ ఏడాది జులైలో సర్య్కులర్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆ గడువును మూడుసార్లు పొడిగించారు. అయినప్పటికీ ప్రయివేటు స్కూళ్లు ఏమాత్రం స్పందించలేదు. అత్యధికంగా ఎయిడెడ్‌ స్కూళ్లు మాత్రమే ఆడిట్‌ రిపోర్టులు సమర్పించాయి. రాష్ట్రంలో మొత్తం 13,677 ప్రయివేటు స్కూళ్లు ఉంటే వాటిలో ఆడిట్‌ రిపోర్టులు ఇచ్చిన స్కూళ్లు కేవలం739 మాత్రమే. మిగిలిన 12,838 పాఠశాలు అసలు స్పందించ లేదు. జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈఓ), ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగి, ప్రయివేటు పాఠశాల్ని కోరినా, పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనితో ఆయా పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేతులు దులుపుకొనే ప్రయత్నంలో ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా ఫలితం శూన్యం. అసలు ప్రయివేటు స్కూళ్లలో ఫీజలు పెంపునకు ప్రాతిపదిక ఏంటి అనే ప్రశ్న కూడా వారి నుంచే వస్తుంది. కనీసం ఆ లెక్కలు ఇస్తే, వచ్చే ఏడాది నుంచైనా ఫీజుల్ని నియంత్రించే అవకాశం ఉంటుందని పేరెంట్స్‌ కమిటీలు చెప్తున్నాయి.

2023-24 విద్యా సంవత్సరంలో కేవలం 147 పాఠశాలలు, 2024-25 సంవత్సరానికి 162 పాఠశాలలు మాత్రమే ఆడిట్‌ నివేదికలను సమర్పించినట్టు సమాచారం.దీనివల్ల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం కోసం చేస్తున్న డిమాండ్లకు గండిపడుతుంది. విద్యాశాఖ ఇప్పటికే ప్రతి పాఠశాల, కాలేజీల్లో ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలనీ, వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని ఆదేశించినా ఫలితం శూన్యం. ఫీజుల వివరాలను నమోదు కోసం విద్యాశాఖ తన అధికారిక పోర్టల్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. పాఠశాలల యాజమాన్యాలు తరగతులవారీగా వసూలు చేస్తున్న ఫీజులను దానిలో నమోదు చేసి, వాటిని నిర్ణయించడానికి ఉపయోగించిన ఆధారాల ను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రయివేటు స్కూళ్లకు మింగుడుపడట్లేదు. అయితే ఆడిట్‌ రిపోర్టులు ఇవ్వని పాఠశాలల్ని ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రత్యక్షంగా సందర్శించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం! అసలు ఎంతమందికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారనే సమాచారం చెప్పేందుకు కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు సిద్దంగా లేరు.

హైదరాబాద్‌లో ఆగమాగం

ప్రయివేటు విద్యాసంస్థలు అధికంగా ఉన్న హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.హైదరాబాద్‌ జిల్లాలోని 2,275 పాఠశాలల్లో 111 మాత్రమే ఫీజుల వివరాలను నమోదు చేశాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 1,968 పాఠశాలలకు గాను 26, రంగారెడ్డి జిల్లాలో 2,046 పాఠశాలలు ఉంటే వాటిలో 12 మాత్రమే వివరాలను సమర్పించినట్లు సమాచారం. ఈ జిల్లాల్ల్లో పాఠశాలల ఫీజులు, రవాణా ఛార్జీలు, పుస్తకాలు, నిఫారాలు, ఇతర తప్పనిసరి చెల్లింపులపై తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలిస్తే సమస్య తీవ్రతపై మరింత స్పష్టత లభించే అవకాశాలు ఉన్నాయి.

విద్యాకమిషన్‌ సిఫార్సు చేసినా.. కాలేజీల్లో ఫీజుల లొల్లి సర్వసాధారణంగా మారింది. 
ఆ క్షణానికి యాజమాన్యాలను, ప్ర

తెలంగాణ ప్రయివేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ముసాయిదా బిల్లును విద్యా కమిషన్‌ 2025 జనవరి 24న ప్రభుత్వానికి సమర్పించింది. దాన్ని 2026 మేలో వెల్లడించారు. ముసాయిదాలో రెండేండ్లకు ఒకసారి ఫీజులను గరిష్ఠంగా 8 శాతం పెంచే ప్రతిపాదన, ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలకు జరిమానాలు వంటి సిఫారసులు ఉన్నాయి. వాటిని అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అనే సందేహాలను పేరెంట్స్‌ కమిటీలు వ్యక్తం చేస్తున్నాయి.

ఫీజు ఎలా నిర్ణయిస్తారు?

ఫీజుల భారాన్ని మోస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఎందుకు అంత ఫీజు వసూలు చేస్తున్నారని తెలుసుకొనే హక్కును కోల్పోతున్నారు. అసలు ఆ ఫీజు మొత్తాన్ని ఎలా నిర్ణయించారనే దానికి ప్రాతిపదిక కూడా లేదు. ఇతర పాఠశాలలతో పోలిస్తే ఫీజులు ఎంత ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలు కూడా తెలుసుకోలేక పోతున్నారు. ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రకటించడం పారదర్శకతకు తొలి అడుగు మాత్రమే. పాఠశాల ఒక తరగతికి ఏడాదికి రూ.50 వేల ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్రకటించినా, అదే తరగతికి మరుసటి ఏడాది రూ.70 వేలు నిర్ణయిస్తే దాన్ని ప్రశ్నించే వ్యవస్థ ఎందుకు లేదు? ఫీజుల పెంపునకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలు అమల్లో ఉన్నాయా? ప్రకటించిన ఫీజుతోపాటు ఇతర పేర్లతో వసూలు చేసే మొత్తాలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అనే సమాచారం ఇప్పటికీ గోప్యమే!


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్