Magazines

ప్రశ్నించే గొంతుకలే ప్రజాస్వామ్యానికి ఊపిరి

25 నిమిషాల క్రితం

lifeblood of democracy.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

​ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య ఉద్యమాలే మార్గం : ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, గాయకులు విమలక్క

రంగవల్లి 27 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంపై సంస్మరణ సభ

​నవతెలంగాణ - వేములవాడ

​​విద్య అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలు చదవడం.. పట్టాలు పొందడం.. ఉద్యోగాలు సాధించడం మాత్రమే కాదు. సమాజంలోని అసమానతలను ప్రశ్నించే తత్వాన్ని, ప్రజల పట్ల బాధ్యతను, సామాజిక మార్పు పట్ల నిబద్ధతను పెంపొందించేదే నిజమైన విద్య అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు అన్నారు. ఫాసిస్ట్ ధోరణులు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేం దుకు ప్రజల ఐక్య పోరాటాలు అవసరమని అరుణోదయ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు.

వేములవాడలో రంగవల్లి విజ్ఞాన కేంద్రం రెండో వార్షికోత్సవం, రంగవల్లి, జాన్‌రెడ్డి, అనిత అమరత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సంస్మరణ సభ నిర్వహించారు. రంగవల్లి 27 ఏండ్ల ఉద్యమ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమానికి రంగవల్లి విజ్ఞాన కేంద్రం అధ్యక్షురా లు విమలక్క అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు విద్యను ప్రశ్నించే తత్వానికి, సామాజిక మార్పునకు అనుసంధానించారని గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల జెన్‌జీ ఉద్యమాలు ప్రగతిశీల ఉద్యమాలకు కొత్త ఆశను కల్పించా యన్నారు. ​

రంగవల్లితో తనకు సుదీర్ఘ ఉద్యమ అనుబంధం ఉందని విమలక్క అన్నారు. దేశంలో ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కేవలం ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో ప్రభావానికే పరిమితం చేయకుండా విధానపరమైన కారణాలను కూడా విశ్లేషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వీకే సభ్యులు రాజేశ్వరి, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి, పీడీఎస్‌యూ విజృంభణ నాయకులు విజయ్, ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ వి.సంతోష్, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు లక్ష్మి, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడీ సుదర్శన్, స్వామిదాస్, అమరుల కుటుంబ సభ్యుడు శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్