Magazines

రీ సర్వేపై రైతులకు అవగాహనేది..?

19 గంటల క్రితం

తరతరాలుగా సాగు చేసుకుంటు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 3 నిమిషాల చదవడం

​గ్రామసభలకు స్పందన కరువు
భూమి విస్తీర్ణంలో తేడాలపై గందరగోళం
​తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి రికార్డుల్లో ఒక విస్తీర్ణం.. క్షేత్రస్థాయి లో మరో విస్తీర్ణం! పాత రికార్డుల్లో ఎక్కువ భూమి నమోదై ఉండి, వాస్తవంగా తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల పరిస్థితి ఏమిటి? రికార్డుల్లో తక్కువ భూమి ఉండి, క్షేత్రస్థాయి లో ఎక్కువ విస్తీర్ణం సాగులో ఉన్న రైతుల సంగతేంటి? ఇలాంటి ఎన్నో సందేహాలు రైతులను వెంటాడుతున్నాయి. భూ సమస్యల కు శాశ్వత పరిష్కారం చూపుతుందని భూ భారతి రీ సర్వేపై రైతుల్లో ఆశలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ప్రచారం, సమాచారం లేకపోవడం వల్ల గ్రామ సభలకు రైతులు రావడం లేదు. ఒక గ్రామంలో భూములు ఉండి మరోచోట నివసించే రైతులకు సర్వే సమాచారం చేరడం లేదు. సరిహద్దు భూముల యజమానులకు ముందస్తు సమా చారం ఇవ్వకుండానే కొలతలు చేపడుతున్నా రన్న ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో మ్యాపులు లేని 24 గ్రామాల్లో గ్రామసభలు పూర్తికాగా, 10 గ్రామాల్లో రీ సర్వే ముగిసిం ది. మిగతా 14 గ్రామాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతున్నది. మ్యాపులు ఉన్న 70 గ్రామాల్లో 45 గ్రామసభలు పూర్తయ్యాయి. ఆరు గ్రామాల్లో సర్వే పూర్తికాగా, మరో ఎనిమిది గ్రామాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. రైతులకు అవగాహన లేకుండానే సర్వేలు పూర్తి అయ్యాయి. ఇలా అయితే గ్రామాలలో రికార్డులు, హద్దుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతుంది.? రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకుండా సర్వే నిర్వహించడం వల్ల కొత్త వివాదాలకు దారితీసే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

​నవతెలంగాణ-మెదక్, రామాయంపేట


​వందేండ్ల రికార్డులు.. 
మారిన భూముల స్వరూపం

​తెలంగాణలో భూముల సర్వే వ్యవస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం కాలంలో రూపొందించిన భూ పట్టాలు, టిప్పన్లు, సెత్వార్, పహాణీలు, కాస్రాలు, వసూల్ బాకీ వంటి పాత రికార్డుల ఆధారంగానే నేటికీ అనేక భూ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అయితే కాలక్రమేణా భూముల క్రయవిక్రయా లు, వారసత్వ బదిలీలు, కుటుంబ పంపకా లు, సర్వే నంబర్ల విభజనలు చోటుచేసుకు న్నాయి. ఈ మార్పులన్నీ పాత రికార్డుల్లో పూర్తిస్థాయిలో నమోదు కాకపోవడంతో భూమి విస్తీర్ణం, హద్దుల విషయంలో సమస్య లు తలెత్తుతున్నాయి. కొందరి పేర్లపై రికార్డుల్లో ఎక్కువ విస్తీర్ణం ఉండి క్షేత్రస్థాయి లో తక్కువ భూమి కనిపిస్తుండగా, మరికొందరు రైతులకు రికార్డుల్లో తక్కువ విస్తీర్ణం నమోదై సాగులో మాత్రం ఎక్కువ భూమి ఉంటోంది. ఇలాంటి సందర్భాల్లో ఏ ఆధారాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు? పాత రికార్డులను అనుసరిస్తారా? ప్రస్తుత క్షేత్రస్థాయి కొలతలకు ప్రాధాన్యత ఇస్తారా? అన్న విషయాలపై రైతులకు స్పష్టత లేదు. ఈ అంశాలపై అధికారుల నుంచి సమగ్ర అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

​​హద్దుల వివాదాలకు పరిష్కారం ఎప్పుడో!

​రీ సర్వేలో అత్యంత కీలకమైన అంశం భూముల హద్దుల నిర్ధారణ. ఒక రైతు భూమికి పక్కనే మరో రైతు భూమి ఉన్నప్పుడు ఇరువురి సమక్షంలోనే కొలతలు నిర్వహిం చడం అవసరం. అయితే సరిహద్దు భూముల యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొలతలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరి భూమి హద్దులు నిర్ణయించే సమయంలో పక్క భూమి యజమాని అందుబాటులో లేకపోతే భవిష్యత్‌లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ పంపకాలు, వారసత్వ బదిలీలు, క్రయవిక్రయాలు, సర్వే నంబర్ల విభజనలతో అనేక ప్రాంతాల్లో హద్దుల సమస్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత రైతులందరికీ సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే కొలతలు నిర్వహించాలి. సర్వే వేగం కంటే రైతుల భాగస్వామ్యానికి, పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే భూభారతి రీ సర్వేపై రైతుల్లో ఉన్న ఆశలు నెరవేరుతాయి.

​ఏమవుతుందో ఏమోనని భయంగా ఉంది

నాకు రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేటలో పొలం ఉంది. నేను ఉండేది మాత్రం రామాయంపేట. భూములు రీ సర్వే చేస్తారని అక్కన్నపేటలో గ్రామసభ నిర్వహించి, అక్కన్నపేట గ్రామంలో సర్వే కూడా పూర్తి అయింది అని అంటున్నారు. అక్కన్నపేట శివారులో ఉన్న నా పొలం హద్దులు మాత్రం నేను ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు. ఏమవుతుందో ఏమోనని భయంగా ఉంది.

​బి. శ్రీశైలం, రామాయంపేట


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్