Magazines

పిల్లల ఇష్టాలను గుర్తించండి

12 నిమిషాల క్రితం

children's
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రియమైన వేణు గీతికకు...
దీపావళికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు వస్తేనే నాకు నిజమైన దీపావళి. నేను కిందటి వారం బుడాపెస్ట్ నుండి వచ్చాను. ఐదు రోజులు అన్ని మర్చిపోయి హాయిగా అందరితో సరదాగా గడిపాను. కొత్త పరిచయాలు, ఎన్నో జ్ఞాపకాలతో సంతోషంగా వచ్చాను. సరే నాన్నా, మళ్ళీ పిల్లల ప్రపంచంలోకి వెళ్తున్నా. ఎందుకంటే మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనసు కలత చెంది వాటి గురించి రాస్తున్నాను. ఇప్పుడు కౌమార దశలో ఉన్న పిల్లల గురించి చెప్తాను. పిల్లలు 9, 10 తరగతి లోకి వచ్చే సరికి వాళ్లకు ముందు ముందు ఏం చదవాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. కొంత మందికి రాక పోవచ్చు. దీనిపై తల్లిదండ్రులు క్షుణ్ణంగా వివరించాలి. ఇంటర్లో వాళ్ళు తీసుకునే గ్రూప్‌నిQQబట్టి పై చదువులకు కావాల్సిన శిక్షణను ఉపాధ్యాయులు ఇస్తారు.

అయితే సమస్య ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టమైన చదువులు చదివించకుండా, తమకు ఇష్టమైన కోర్సులు తీసుకోమని వత్తిడి తెస్తుంటారు. ఉదాహరణకు డాక్టర్ అవ్వాలి , ఐఐటీలో సీటు తెచ్చుకోవాలని అంటారు. పిల్లలకు కళల పట్ల ఆసక్తి ఉండవచ్చు, హోటల్ మేనేజ్మెంట్, టీచర్‌.. ఇలా వారి ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు. అదే వారికి ఇష్టమైన కోర్సు అయితే కష్టమైన ఇష్టంగా చదువుతారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తూ ఉంటారు. ఉదాహరణకు ఆ అబ్బాయి చూడు ఐఐటీలో సీటు తెచ్చుకున్నాడు, నీట్‌లో మంచి ర్యాంక్ తెచుకున్నది అంటూ ఉంటారు. ఇటువంటి మాటలు పిల్లల మనసులో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ వత్తిళ్ళు తట్టులోలేక, ఇష్టం లేని చదువులు చదవలేక ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. తల్లిదండ్రుల పట్ల ద్వేషం కూడా పెంచుకుంటారు.

కొంతమంది చెడు అలవాట్లకు బానిసలవుతారు. నువ్వు 8వ తరగతిలో ఉన్నపుడు స్కూల్ నుండి వస్తూనే నన్ను ఆడిగావు. ‘అమ్మా! పదో తరగతి తర్వాత ఏం చదవాలో స్పష్టత రావడం లేదమ్మ’ అన్నావు. అప్పుడు నీకు వివరంగా అన్నీ చెప్పాను. ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇంజినీరింగ్, డాక్టర్, చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వొచ్చో చెప్పాను. అప్పుడు నువ్వు అబ్దుల్ కలాంలా ఇంజినీర్ అవుతా అన్నావు. చాలా సంతోషం వేసింది. అంతటి గొప్ప మహానుభావుడిని స్మరించుకున్నందుకు. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నందుకు. అందుకే నువ్వు ఏది చదువుతాను అంటే అదే చదివించాను, ప్రోత్సాహించాను. ఈ రోజుల్లో కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. మా చిన్నతనంలోలా కాదు ఇప్పుడు. అన్ని రంగాలలోనూ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో నువ్వు కూడా నీ పిల్లల విషయంలో వారికి ఇష్టమైన చదువు చదవ డంలో ప్రోత్సహించు. ఉంటాను నాన్నా..


ప్రేమతో అమ్మ పాలపర్తి సంధ్యారాణి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్