రైతుల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సైదులు
నవతెలంగాణ-నెల్లికుదురు
ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే అఖిలభారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ కార్మిక వ్యవసాయ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఈసంపల్లి సైదులు అన్నాడు. మండల కేంద్రంలో సంబంధిత కరపత్రం ఆవిష్కరణ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగ హక్కులు వ్యవసాయ రంగం రక్షణ కోసం దేశవ్యాప్తంగా సమస్యలపై ఉద్యమం నిర్వహించి సాగుదారులకు రక్షణ కవచంగా ఏఐకేఎస్ నిలిచిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 13 నెలల పాటు కొనసాగిన ప్రతిష్టాత్మక మైన రైతు ఉద్యమంలో రైతు సంఘం ముఖ్య భూమిక పోషించింది. మహబూబాబాద్ జిల్లాలో అనేక సంవత్సరాలుగా వర్షాధారం బావులు బోర్లు విద్యుత్ మోటార్లపైనే ఆధారపడి వ్యవసాయం కొనసాగుతున్న తరుణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సారెస్పీ ఉపకాల్వలైన వెన్న వారం తీగలవెనణి ఎస్ఆర్ఎస్పి రెండవ పేస్ కాలువలను సాధించుకున్నాం అని అన్నాడు.
ప్రతి కాల్వాల ద్వారా చెరువులు కుంటలు నింపాలని తాగునీరు అందించాలని మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరుగుతున్న మోసాలు ఎప్పటికప్పుడు ఎండ కొడుతూ రైతుల పక్షాన పోరాడింది రైతులకు బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని కొత్తగా రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు పెరుమాండ్ల పుల్లయ్య సిఐటియు నాయకులు బొల్లం ఎల్లయ్య ఇసంపెళ్లి ఐలేష్ రవి వెంకన్న శ్రీను వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)