Magazines

విస్తృతంగా పర్యటించిన వైస్ చైర్మన్

20 నిమిషాల క్రితం

vice chairman
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ విస్తృతంగా పర్యటించారు. 10, 20, 21, 22వ వార్డుల్లో పర్యటించి, ఎక్కడెక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీలు అవసరమో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.


వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు జూపల్లి ప్రమోద్, వార్డు కౌన్సిలర్లు మిండా హరిబాబు, ఎస్‌కే నూర్జహాన్, నార్లపాటి దివాకర్, నార్లపాటి మౌనిక, మండల నాయకులు, ఆయా వార్డుల స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్