Magazines

మున్సిపల్ కమిషనర్ అజయ్ బాధ్యతలు స్వీకరణ 

14 నిమిషాల క్రితం

Municipal Commissioner
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-వర్ధన్నపేట

వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా శనివారం సాయంత్రం జి అజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాడు మున్సిపల్ సిబ్బంది కొలువురు నూతన కమిషనర్ జి. అజయ్ ని మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్