నవతెలంగాణ ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శనివారం నిర్వహించిన మత్స్యపారిశ్రామిక సంఘం ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘం అధ్యక్షుడిగా చెవ్వు సోములు, ఉపాధ్యక్షుడిగా బెదరబోయిన ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా గుర్రాల రమేష్,కార్యదర్శిగా గుండేల మైపాల్, కోశాధికారిగా రుద్దురు నరసింహులును ఎన్నుకున్నారు.
డైరెక్టర్లుగా తలారి పాండు, చిట్టబోయిన చంద్రం,తలారి నరేష్,మామిండ్ల నరసింహులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా కుల పెద్దమనిషి కరుణాకర్, ముదిరాజ్ కుటుంబ సభ్యులు, సంఘం పెద్దలు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి నూతన కమిటీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.మత్స్యకారుల మధ్య ఐక్యతను బలోపేతం చేస్తూ సంఘ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.





కామెంట్‌లు (0)