అర్హులైన ప్రతి కుటుంబానికీ ఐకేజేబీపీ అమలు చేయాలి

7 నిమిషాల క్రితం

IKJBP
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆన్‌లైన్ నమోదులో అర్హులందరికీ అవకాశం కల్పించాలి

- సర్పంచ్‌లు కూరం దుర్గమ్మ, పాయం శ్రీదేవి

నవతెలంగాణ - అశ్వారావుపేట

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) అర్హులైన ప్రతి కుటుంబానికీ వర్తించేలా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ చేపట్టాలని నందిపాడు, గుమ్మడవల్లి గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు కూరం దుర్గమ్మ, పాయం శ్రీదేవి సూచించారు.


శనివారం ఆయా గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న ఐకేజేబీపీ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు కే.స్వరూప, నాగమణిలకు పలు సూచనలు చేశారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించి, కుటుంబంలో 59 ఏళ్లు పైబడిన వారు ఉన్నప్పటికీ, 59 ఏళ్లలోపు వయస్సు కలిగిన అర్హులైన ఇతర కుటుంబ సభ్యులకు బీమా వర్తించేలా వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అర్హులైన ఏ కుటుంబమూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాన్ని కోల్పోకూడదని వారు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్