ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష

10 నిమిషాల క్రితం

entrance exam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

- 149 మందికి 131 మంది విద్యార్థుల హాజరు

- 18 మంది గైర్హాజరు

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కేంద్రానికి మొత్తం 149 మంది విద్యార్థులను కేటాయించగా, 131 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 18 మంది గైర్హాజరయ్యారని స్థానిక ఎంఈఓ, పరీక్ష కేంద్రం పర్యవేక్షకులు పి.ప్రసాద్ రావు తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష పూర్తయిందని పేర్కొన్నారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పరీక్ష కేంద్రం చీఫ్ పి.హరిత పరీక్ష వివరాలను వెల్లడించారు. రూట్ ఆఫీసర్‌గా కరకగూడెం నవోదయ విద్యాలయ ఉద్యోగి బాబురావు వ్యవహరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్