14 ఏళ్లు అయినా ఉద్యమ కారులకు గుర్తింపు ఏది
నవతెలంగాణ-వర్ధన్నపేట
రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన వారికి నేటికీ గుర్తింపు అందని గుర్తింపు. అందలేదని,దీక్షా దివస్ వేళ మరోసారి ఉద్యమకారుల సమస్యలను లేవనెత్తుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవించుకుని ఆందోళనలు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని బస్టాండ్ ఆరుబయట నిర్లక్ష్యంగా వదిలేశారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు వర్ధన్నపేట నియోజకర్గంలో కేంద్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు, సామాన్య ప్రజలు తమ జీవితాలను పణంగా పెట్టి పోరాటం చేశారు. ఎన్నో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, పోలీసు కేసులు, జైలు జీవితాలు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
మరికొందరు తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి ఉద్యమమే ఊపిరిగా బతికారు. వారి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం ఏర్పడి పాలన సాగిన పదేళ్ల తర్వాత ఉద్యమకారుల జీవితాల్లో ఆశించిన మార్పు వచ్చిందా? అన్న ప్రశ్న ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ఏర్పడితే తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని, తమ త్యాగాలకు గుర్తింపు లభిస్తుందని, కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉంటుందని ఉద్యమకారులు ఆశించారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అనేక మంది ఇప్పటికీ సాధారణ జీవిత సమస్యలతో సతమతమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ సమాన గుర్తింపు లభించిందా? అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయా ? అనే విషయం చర్చనీయశంగా మారింది. ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న కొందరికి మాత్రమే ప్రభుత్వ పరంగా గుర్తింపు లభించినప్పటికీ, ఇంకా అనేక మంది ఉద్యమకారులు తమ పోరాటానికి తగిన గుర్తింపు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారికి ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య భద్రత, వారి కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమాలు అమలు కావాలనీ ఆశిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఎంత మంది కిగుర్తింపు లభించిందని , అనేక మంది ఉన్నపటి తమ గుర్తింపు లేదని, ఎదురు చూస్తున్నారని పలువురు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లో నైనా ఉద్యమ కారులను పారదర్శకంగా సేకరించి, నిజమైన అర్హులను గుర్తించి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.అని అమరవీరుల పేర్లను సభల్లో స్మరించుకోవడమే కాకుండా, వారి కుటుంబాల జీవన పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అండగా నిలవడమే నిజమైన నివాళిగా చెప్ప వచ్చు.
వర్ధన్నపేట నియోజకవర్గంలోనూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది తమ అనుభవాలను, త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. ఉద్యమ సమయంలో ఉత్సాహంగా ముందుకు సాగిన యువతలో కొందరు నేడు కుటుంబ బాధ్యతలు, ఉపాధి, ఆర్థిక సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం తమ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని ఆశించిన వారు, తమకు తగిన గుర్తింపు, గౌరవం లభించాలని కోరుకుంటున్నారు. గ్రామస్థాయిలో ఉద్యమకారులను గుర్తించి, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






కామెంట్లు (0)