Magazines

బియ్యం అక్రమార్కులపై కొరడా

1 గంట క్రితం

Whipping up rice smuggling
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం

నిందితులపై 
11 కేసులు నమోదు

తూకంలో మోసం ...
ధరల్లో వ్యత్యాసం

ప్రజల అవసరాలే ఆసరాగా వ్యాపారుల దోపిడీ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

బియ్యం కృత్రిమ కొరతను సృష్టించడం, అధిక ధరలకు అమ్మడం, తూకంలో తేడాలు, లేబుల్‌ ‌మార్చడం వంటి చర్యలతో ప్రజలను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. అందుకు కారణమైన అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు దాడు లను ముమ్మరం చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ (ఈటీఎఫ్‌), తూనికలు-కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) సంయుక్తంగా అక్టోబర్‌‌లో మూడు రోజులపాటు అక్రమార్కులపై ఆకస్మిక దాడులు నిర్వహించాయి. బియ్యం దందా నుంచి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని రిటైల్‌, హోల్‌సేల్ దుకాణాలపై ఈ దాడులు జరిగాయి. దీనిలో భాగంగా మొత్తం 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు.11 కేసులు నమోదు చేశారు. ప్రజలను మోసం చేసేందుకు వ్యాపారులు చేస్తున్న అనేక అక్రమాలు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోల లేబుల్స్ వేసి తూకంలో మోసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కంపెనీ ముద్రించిన అసలు ధరలపై ఎక్కువ రేట్లతో కొత్త స్టిక్కర్లను అతికించి అమ్ముతున్నట్టు గుర్తించారు. ట్రేడ్, జీఎస్టీ, లేబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ వంటి తప్పనిసరి లైసెన్సులు లేకుండానే చాలామంది వ్యాపారం చేస్తున్నారని ఈ తనిఖీల్లో తేలింది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, దారి మళ్లించడం వంటివి కూడా అధికారులు గుర్తించారు. పదేపదే తప్పు చేస్తున్న వారిపై సరూర్ నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్లలో వెంటనే 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌ ) కింద కేసులు నమోదు చేశారు. ఈ చట్టాల ప్రకారం వీరికి ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇలాంటి మోసాలు జరగకుండా, నిరంతర నిఘా ఉంచి అక్రమార్కులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరి స్తుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్