Sunday, February 15, 2026
E-PAPER
Homeజాతీయంరాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే

రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే

- Advertisement -

హోం శాఖ ప్రతిపాదనను తోసిపుచ్చిన లడఖ్‌ నేతలు
శ్రీనగర్‌ :
లడఖ్‌కు ప్రాదేశిక మండలి ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను స్థానిక నేతలు వ్యతిరేకించారు. లడఖ్‌కు ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేసి హిల్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిలర్‌ (సీఈసీ)ని ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిని చేస్తామని హోం శాఖ ప్రతిపాదించింది. అయితే లడఖ్‌ నేతలు దీనిని వ్యతిరేకించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాల్సిందేనని, ఈ ప్రాంతానికి ఆరో షెడ్యూల్‌ను వర్తింపజేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. లడఖ్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు అధ్యక్షతను ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో కేంద్రం ఈ ప్రతి పాదనను ముందుకు తెచ్చింది. సమావేశానంతరం లెహ్‌ అపెక్స్‌ బాడీ (లాబ్‌) కో-ఛైర్మన్‌ చెరింగ్‌ డోర్జే మాట్లా డుతూ హోం శాఖ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించామని చెప్పారు. ప్రతిపాదనపై చర్చించేం దుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశామని తెలిపారు. లడఖ్‌కు ఆరో షెడ్యూల్‌ హోదాను, పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించి శాసనసభను ఏర్పాటు చేయాలని లాబ్‌, కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ డిమాండ్‌ చేస్తున్నాయని అన్నారు. అయితే ఈ డిమాండ్లు నెరవేర్చడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయంటూ హోం శాఖ కుంటిసాకులు చెబుతోందని డోర్జే విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -