నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రాలు ప్రతి కుక్క కాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో పెరిగిపోతున్న కుక్కకాటు ఘటనలపై విచారణను కోర్టు మంగళవారం కూడా కొనసాగించింది. రాష్ట్రాలు ప్రతి కుక్క కాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తదని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో పెరిగిపోతున్న కుక్కకాటు ఘటనలపై విచారణను కోర్టు మంగళవారం కొనసాగించింది. కుక్కకాటు ఘటనల నివారణకు రాష్ట్రాలు (States) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చీవాట్లు పెట్టింది. ఇలాగే కొనసాగితే ప్రతి కుక్క కాటుకు రాష్ట్రాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తదని పేర్కొంది. కుక్కకాటుతో గాయమైందా, మరణం సంభవించిందా..? బాధితులు పిల్లలా, వృద్ధులా అనే వాటితో సంబంధం లేకుండా తాము ప్రతి కుక్కకాటు ఘటనకు రాష్ట్రాలు భారీగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. కుక్కలకు ఆహారం పెట్టే వాళ్లు కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
వీధి కుక్కల అంశం భావోద్వేగాలతో కూడుకున్న అంశమని అడ్వకేట్ మనేకా గురుస్వామి వ్యాఖ్యానించడంపై కోర్టు పైవిధంగా స్పందించింది. కాగా కుక్కకాటు ఘటనలపై గత విచారణ జనవరి 9న జరిగింది. దేశంలో కుక్క కాటు ఘటనలు పెరిగిపోతుండటంపై కోర్టు తొలిసారి గత ఏడాది నవంబర్ 7న స్పందించింది. ప్రభుత్వం సంస్థ దగ్గరి నుంచి కుక్కలను తీసుకెళ్లి ప్రత్యేక షెల్టర్‌లలో ఉంచాలని అప్పట్లో ఆదేశించింది.



