- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పక్కింటి వారిని తిట్టాడనే కోపంతో సవతి తండ్రి చేసిన దాడిలో పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘాజిమిల్లత్ కాలనీలో నివసిస్తున్న షేక్ అజ్మత్ అజ్‌హర్ ఈ నెల 7న పొరుగువారితో గొడవపడ్డాడు. ఈ విషయం తెలిసిన సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ బాలుడిని చెంపదెబ్బలు కొట్టి, నేలకేసి బలంగా బాదాడు. తీవ్ర గాయాలతో చెవుల నుంచి రక్తస్రావం కావడంతో తల్లి నఫీస్ బేగం బాలుడిని ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ శుక్రవారం అజ్మత్ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



