- Advertisement -
- ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని హాస కొత్తూర్, చౌట్ పల్లి గ్రామాలలో నర్సరీలను ఆయన పరిశీలించారు. వేసవి ఎండలు ముదిరినందున మొక్కల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండ నుండి మొక్కల సంరక్షణ కోసం షెడ్ నెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం, సాయంత్రం మొక్కలకు నీటిని అందించాలన్నారు. వర్షాకాలంలో చేపట్టే హరితహారం కార్యక్రమం నాటికి గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కల్ని సిద్ధం చేయాలన్నారు. పండ్ల మొక్కలు, పూల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కల్ని సిద్ధంగా ఉంచాలన్నారు. నర్సరీల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించోద్దని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, చౌట్ పల్లి సర్పంచ్ మహబూబ్, పంచాయతీ కార్యదర్శులు శాంతి కుమార్, నవీన్ గౌడ్, శివ, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



