Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీసీఐ పున:ప్రారంభానికి చర్యలు అభినందనీయం

సీసీఐ పున:ప్రారంభానికి చర్యలు అభినందనీయం

- Advertisement -

– ప్రెస్‌మీట్‌లో సాధన కమిటీ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో సీసీఐ పరిశ్రమ పున:ప్రారంభానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఢిల్లీలో సమావేశమై సానుకూలంగా స్పందించడాన్ని సీసీఐ సాధన కమిటీ అభినందించింది. ఈ మేరకు గురువారం సుందరయ్య భవనంలో కమిటీ కన్వీనర్‌ దర్శనాల మల్లేశ్‌, కో కన్వీనర్‌ విజ్జగిరి నారాయణ, మిగిలిన సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీసీఐ సాధన కమిటీ ప్రతినిధి బృందం ఏప్రిల్‌ నెలలో ఢిల్లీకెళ్లి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసిందన్నారు. ఆరు నెలల్లో సీసీఐ పరిశ్రమ పున:ప్రారంభానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించడం సంతోషకరమన్నారు. సీసీఐ పున:ప్రారంభం కోసం కమిటీ మూడేండ్లుగా నిర్విరామంగా పోరాడుతోందన్నారు. ఆ పోరాట ఫలితమే నేటి కదలిక అన్నారు. ఈ ప్రక్రియలో ఎంపీ, ఎమ్మెల్యే సానుకూల పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ ప్రారభమైతే జిల్లా పారిశ్రామికంగా ఒక ముందడుగు వేసినట్టు అవుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. సీసీఐ పున:ప్రారంభమయ్యే వరకు ప్రజల సహకారంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలవనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సాధన కమిటీ నాయకులు కొండ రమేశ్‌, లోకారి పోశెట్టి, బండి దత్తాత్రి, జగన్‌ సింగ్‌, అన్నమొల్ల కిరణ్‌, ఈశ్వర్‌దాస్‌, విఠల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -