– ట్రాన్స్కో ఏఈ అన్నయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో వేసవిలో ఓవర్ లోడుతో విద్యుత్ సమస్యలు తదితకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్కో ఏఈ అన్నయ్య మంగళవారం తెలిపారు. గ్రామంలో వేసవి సమయం లో ఓవర్ లోడ్ తో తరచు విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ఓవర్ లోడ్ ట్రాన్స్ ఫార్మర్లలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామన్నారు. ఇందుకు అధికారులు స్పందించి ఓవర్ లోడ్ ట్రాన్స్ ఫార్మర్లలను మంజూరు చేసినట్లు ఏఈ అన్నయ్య తెలిపారు.
ఇప్పటివరకు కమ్మర్ పల్లి సబ్ స్టేషన్ లో 3పీహెచ్ 100 కెవిఎ డిటిఆర్ ఉండేదని ప్రస్తుతం కొత్తది 3పీహెచ్ 25కెవిఎ డిటిఆర్ ను నిజామాబాద్ స్టోర్ నుండి మంగళవారం డ్రా చేసి తీసుకొచ్చినట్లు తెలిపారు. నూతన 3పీహెచ్ 25కెవిఎ డిటిఆర్ బిగింపు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందిస్తామని ఈ సందర్భంగా ఏఈ అన్నయ్య తెలిపారు. కాగా గ్రామంలో వేసవి కరెంట్ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


