నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. హర్మూజ్ వద్ద నౌకల రాకపోకలు ప్రారంభమవుతాయన్న అంచనాలు, రూపాయి పతనానికి బ్రేక్ పడడం వంటి కారణాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ముఖ్యంగా మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.
సెన్సెక్స్ ఉదయం 75,826.68 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,502.85) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,324.73 – 76,304.26 మధ్య కదలాడింది. చివరికి 567.99 పాయింట్ల లాభంతో 76,070.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 172.35 పాయింట్ల లాభంతో 23,581.15 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 92.38గా ఉంది.



