Thursday, November 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. ట్రేడింగ్ సమయంలో చారిత్రాత్మక గరిష్ఠాలను తాకినప్పటికీ, చివరికి స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 110.87 పాయింట్లు లాభపడి 85,720.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10.25 పాయింట్ల స్వల్ప లాభంతో 26,215.55 వద్ద నిలిచింది.

రోజువారీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 86,055.86 వద్ద, నిఫ్టీ 26,310.45 వద్ద ఆల్-టైమ్ హై స్థాయిలను నమోదు చేశాయి. ఇది ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. సాంకేతికంగా నిఫ్టీకి 26,300 కీలక నిరోధకంగా ఉందని, దీనిని దాటితే 26,350–26,450 స్థాయిలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, 26,150–26,000 మధ్య బలమైన మద్దతు లభిస్తోందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -