- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియాల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అమెరికా టెక్ స్టాక్స్‌లో విక్రయాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సహా మన మార్కెట్లూ నష్టాలు చవిచూశాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలక డేటా ఈ వారం వెలువడనుండడంతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఈ క్రమంలోనే సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది.
- Advertisement -



