- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, టారిఫ్ భయాల వేళ మదుపర్ల లాభాల స్వీకరణ వంటివి ప్రభావం చూపాయి. ముఖ్యంగా కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ స్టాక్స్‌లో అమ్మకాలతో సూచీలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 25,603 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్ 250.48 నష్టంతో 83,627.69 వద్ద ముగియగా.. నిఫ్టీ 57.95 పాయింట్ల నష్టంతో 25,732.30 వద్ద స్థిరపడింది.
- Advertisement -


