Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంతక్షణమే దాడులు ఆపండి

తక్షణమే దాడులు ఆపండి

- Advertisement -

– గాజాలో కాల్పుల విరమణకు అరబ్‌ దేశాల పిలుపు
బాగ్దాద్‌:
గాజాలో దాడులకు స్వస్తి పలకాలని, తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అరబ్‌ నేతలు పిలుపునిచ్చారు. గాజాలో ఉధృతంగా బాంబు దాడులు జరుపుతూ మొత్తంగా విధ్వంసం చేసిన ఇజ్రాయిల్‌ ఇప్పుడు అక్కడ నుండి పాలస్తీనియన్లను బయటకు పంపేయాలని చూస్తోందని అరబ్‌ నేతలు విమర్శించారు. గాజాలో యుద్ధమంటూ ఆగితే ఆ ప్రాంతంలో పునర్నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడానికి సాయమందిస్తామని అరబ్‌ నేతలు హామీ ఇచ్చారు. శనివారం బాగ్దాద్‌లో జరుగుతున్న అరబ్‌ నేతల సదస్సులో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతాV్‌ా అల్‌ శిశి మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ చర్యలు వ్యవస్థాగతమైన నేరాలని విమర్శించారు. పాలస్తీనియన్ల జాతిని నిర్మూలించడమే వారి ఉద్దేశమని అన్నారు. గాజా శాంతి చర్చలకు ప్రధాన మధ్యవర్తుల్లో ఒకరుగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు వ్యవహరించారు. ఈ సదస్సుకు ఆతిధ్యమిచ్చిన ఇరాక్‌ ప్రధాని మహ్మద్‌ షియా అల్‌ సుదాని మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ మారణకాండకు పాల్పడుతోందని విమర్శించారు. గాజా, లెబనాన్‌లకు చెరో రెండు కోట్ల డాలర్లను సాయంగా అందిస్తామని హామీ ఇచ్చారు. సదస్సునుద్దేశించి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ ప్రసంగిస్తూ, పాలస్తీనియన్లను సామూహికంగా ఇలా శిక్షించడాన్ని ఎవరూ సమర్ధించబోరని వ్యాఖ్యానించారు. ఊచకోతను నివారించడానికి చర్యలు తీసుకుంటారా? లేదా? అని యుఎన్‌ ఎయిడ్‌ చీఫ్‌ టామ్‌ ఫ్లెచర్‌… భద్రతా మండలిని ప్రశ్నించారు.
ఇజ్రాయిల్‌ దాడుల్లో వందమంది మృతి
ఆరు వారాల పాటు కాల్పుల విరమణ అమలు చేసిన ఇజ్రాయిల్‌, మార్చిలో కాల్పుల విరమణను ఉల్లంఘించి తిరిగి సైనిక చర్యలకు పాల్పడడం ఆరంభిం చింది. గాజాలో అత్యంత దారుణంగా బాంబు దాడులకు తెగబడుతోంది. శుక్రవారం నాటి దాడుల్లో వందమంది మరణించారు. గత కొన్ని రోజులుగా జరుగు తున్న దాడుల్లో వందలాదిమంది మరణించారు. గాజాలో మొత్తంగా ఆహారం అందకుండా దిగ్బంధనం చేసింది. కాల్పుల విరమణకు చర్చలను పునరుద్ధరించి, ఆహారం, మందుల సరఫరాలు గాజాకు అందేలా చూడాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. మిగిలిన బందీలను విడిచిపెట్టేలా హమాస్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు గానూ పెద్ద ఎత్తున మిలటరీ ఆపరేషన్‌ చేపట్టినట్లు ఇజ్రాయిల్‌ రక్షణమంత్రి శనివారం తెలిపారు. అరబ్‌ దేశాల్లో ట్రంప్‌ పర్యటన ముగిసిన వెంటనే ఈ మిలటరీ ఆపరేషన్‌ ప్రారంభించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad