Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం'బాయ్ కాట్‌ కాశ్మీర్‌'ను ఆపండి!

‘బాయ్ కాట్‌ కాశ్మీర్‌’ను ఆపండి!

- Advertisement -

– పర్యాటకాన్ని ప్రోత్సహించండి
– జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా
శ్రీనగర్‌:
జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. పహల్గాంలో కేబినెట్‌ సమావేశం నిర్వహించిన మరుసటి రోజు బుధవారం ఆయన మరో పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ‘బారుకాట్‌ కాశ్మీర్‌’ ప్రచారాన్ని నిలువరించడానికి కేంద్రం కూడా రంగంలోకి దిగాలని ఆయన కోరారు. పహల్గాం ఉగ్ర దాడిని కాశ్మీర్‌ ప్రజలు ముక్తకంఠంతో ఖండించారని, అయినా వారు శిక్షకు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడితో భయపడిన ప్రజలు జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలకు రావడానికి వెనుకాడుతుండడంతో పర్యాటకంపైనే ప్రధానంగా ఆధారపడిన ప్రజలకు జీవనోపాధి ఇబ్బందవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి దాడులు మరోసారి జరగబోవని రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌, కేంద్రం ఈ మూడు కలిసి కట్టుగా ప్రజలకు హామీనివ్వాలని ఆయన కోరారు. పర్యాటకులకు జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా వుందనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలన్నారు. సమీక్షా సమావేశానంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏప్రిల్‌ 22 నాటి దాడి తర్వాత అంతా స్తంభించిందన్నారు. అందుకే తాము ముందుకొచ్చి ఈ సమావేశాలు నిర్వహించామని, కనీసం ప్రచారం జరగాలన్న ప్రయత్నాలివని అబ్దుల్లా పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad