Wednesday, May 21, 2025
Homeజాతీయంగాజాలో మారణకాండను ఆపాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌

గాజాలో మారణకాండను ఆపాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌

- Advertisement -

న్యూఢిల్లీ: గాజాలో ఇజ్రాయిల్‌ సుదీర్ఘ కాలంగా, అత్యంత అమానుష రీతిలో కొనసాగి స్తున్న దాడుల పట్ల సీపీఐ(ఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఈ దాడులకు ఇజ్రా యిల్‌ స్వస్తి చెప్పాలని, కాల్పుల విరమణను అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది కేవలం ఏప్రిల్‌ మాసంలోనే ఇజ్రా యిల్‌ సాగించిన వైమానిక, భూతల దాడుల్లో 2,037మంది పాలస్తీనియన్లు మరణించారు. గత రెండు రోజుల్లో 200మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 2023 అక్టోబరు 7 నుంచి మొత్తంగా 53,384మంది పాలస్తీనియన్లు మరణించగా, వారిలో 94శాతం మంది సామాన్య పౌరులే. 51శాతం మంది చిన్నారులే, 16శాతం మంది మహిళలు కాగా 8శాతంమంది వృద్ధులున్నారు. రెండు మాసాలకు పైగా గాజాలోకి ఆహార ట్రక్కులు ప్రవేశించనీ యకుండా ఆంక్షలు విధించిన ఇజ్రాయిల్‌ తాజాగా ప్రాధమిక సాయాన్ని మాత్రమే లోపలకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా, గాజాలో దుర్భిక్ష పరిస్థితులు అత్యంత దారుణంగా వున్నాయి. అమెరికా మద్దతుతో జోరు పెంచుకుంటున్న ఇజ్రాయిల్‌, మొత్తంగా గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం గురించి ఇప్పుడు మాట్లాడుతోంది. ఈ ఊచకోత దాడులను తక్షణమే ఆపాల్సిందిగా భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కోరింది. యుద్ధ నేరాలకు, ఊచకోతకు పాల్పడిన ఇజ్రాయిల్‌ నేతలను విచారించాల్సిందిగా కోరాలని పేర్కొంది. పాలస్తీనా ప్రజలకు సిపిఎం సంఘీభావాన్ని ప్రకటించింది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967ముందు నాటి సరిహద్దులతో పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న న్యాయమైన డిమాండ్‌కు మద్దతునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -