- Advertisement -
- గాలివానకు ఎగిరిపోయిన ఇంటి రేకులు
- అడ్డంగా విరిగి పడిన చెట్లు
- కింద పడిపోయిన కరెంటు స్థంభాలు
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం పెద్దవూరలో శుక్రవారం రాత్రి ఒక్క సారిగా గాలి దుమారం, వర్షం వచ్చి బీభత్సం సృష్టించాయి. మండలం లోని చలకుర్తి ప్రభుత్వ పాఠశాల లో పెద్ద చెట్లు విరిగి పడ్డాయి, రోడ్డు పక్కల ఉన్న చెట్లు విరిగి పడడం తో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, మెడికల్ దుకాణం పై కప్పు రేకులు గాలికి ఎగిరి రోడ్డు పై పడ్డాయి. పెద్దవూర నుంచి నాగార్జున సాగర్ వెళ్లే జాతీయ రహదారిలో రామన్నగూడెం, చలకుర్తి ఎక్స్, రోడ్డు, బెట్టేలతండా సమ్మక్క సారక్క వద్ద పెద్ద చెట్లు విరిగి అడ్డంగా పడిపోయాయి. అనంతరం కొద్ది పాటి వర్షం కూడా పండింది. అర్ధ రాత్రి సమయంలో హాలియా లో కొద్ది సేపు వడగండ్ల వర్షం పడింది. గాలి తీవ్రత అధికంగా ఉండడం తో విద్యుత్ స్తంభాలు కూలి పోయి విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. వాటికి పునరుద్ధరించే పనిలో ట్రాన్స్ కో అధికారులు ఉన్నారు.రేకుల షెడ్ల ఇండ్లపై రేకులు ధ్వంసం అయ్యాయి.చలకుర్తిలో కరెంటు స్టంభాలు విరిగి పడిపోయాయి పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. కరెంట్ స్తంభాలు విరిగిపోయి, తీగలు తెగిపడ్డాయి. చలకుర్తి ఐకేపీ దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్ముకోవడానికి పోసిన ధాన్యం కొద్దిపాటి వర్షానికి తడిసిపోయింది.
- Advertisement -