- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఇటీవల వచ్చిన మొంథా తుఫాను, అతిభారీ వర్షాల వల్ల తెలుగు రాష్ర్లాల్లోని పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అరటి రైతులు కూడా పూర్తిగా పంట కోల్పోయారు. తుఫాను, భారీ వర్షాల ప్రభావంతో తోటలు విరిగి, పడిపోయాయి. దీంతో రైతులకు తీరని నష్టం మిగిలింది. వర్షాలతో అరటి నాసిరకంగా మారడంతో కొనే నాథుడే కరువయ్యారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో అరటికి భారీ ఉంటూ.. రైతులకు మంచి లాభాలు వస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి ఒక గెలకు రూ.500 ఉండగా.. ఈ ఏడాది అది ఏకంగా రూ.200 కు పడిపోయింది. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
- Advertisement -


