Wednesday, March 18, 2026
E-PAPER
Homeజిల్లాలుగాలికుంటు నివారణ టీకాలతో పశుసంవర్ధకానికి బలోపేతం

గాలికుంటు నివారణ టీకాలతో పశుసంవర్ధకానికి బలోపేతం

- Advertisement -

నవతెలంగాణ-కాటారం: మండల కేంద్రం కాటారంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశువైద్య సిబ్బంది రైతులకు, పశుపోషకులకు గాలికుంటు వ్యాధి తీవ్రత, టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, వార్డు మెంబర్ రవి సహకారంతో గ్రామంలోని పశువులను సమయానికి టీకాల కోసం తీసుకువచ్చేలా రైతులకు సమాచారం అందించారు. పశువులను త్వరగా విడవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్, డాక్టర్ ధీరజ్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతుందని, ప్రతి రైతు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. టీకాలు వేయించుకోకపోతే పాలు 50–80 శాతం వరకు తగ్గిపోవడం, పశువులు తినలేక బలహీనమవడం, కాళ్లలో పుండ్లు రావడం వల్ల నడవలేకపోవడం, చిన్న దూడలు చనిపోయే ప్రమాదం ఉండటం వంటి తీవ్రమైన నష్టాలు కలుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు తుంగల రాజశేఖర్, సుల్తానాబేగం, పశుమిత్ర నజీమా, గోపాలమిత్ర చిట్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. మొత్తం 110 గేదెలకు, 10 గోజాతి పశువులకు టీకాలు వేశారు.రైతులు తమ పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి టీకా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -