నవతెలంగాణ – మద్నూర్: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్ను డోంగ్లి మండల ఆర్ఐ సాయిబాబా ప్రత్యేక నిఘాతో పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుబడ్డ ఇసుక ట్రాక్టర్లు మద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులకు అప్పగించారు. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ శాఖ హెచ్చరికలను బేకార్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ సాయిబాబా హెచ్చరికలు జారీ చేశారు.
- Advertisement -