Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపసిబిడ్డ హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పసిబిడ్డ హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– నాగర్‌ కర్నూల్‌ ఎస్పీతో ఫోన్‌లో కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పసి బిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె నాగర్‌ కర్నూల్‌ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జాతరకు వెళ్లిన రజక దంపతులు గణేశ్‌, మౌనిక, రెండు నెలల వారి పసి బిడ్డ, తల్లి, చెల్లిపై దాడి చేయగా ఈ దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. పాప తల్లి, కుటుంబ సభ్యులతో కవిత ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -