Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనలో కఠిన చర్యలు తీసుకోవాలి

ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనలో కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– కిరణ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : ఎన్‌పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌
– ఆస్పత్రిని సందర్శించిన ఎన్‌పీఆర్డీ బృందం
నవతెలంగాణ-సిటీబ్యూరో

ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషితాహారం ఘటనపై సమగ్ర విచారణ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. అస్వస్థతకు గురై మృతిచెందిన కిరణ్‌ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఎన్‌పీఆర్డీ నేతలు కె.వెంకట్‌, ఆర్‌.వెంకటేష్‌, శశికళ, మల్లేష్‌ తదితరులు బుధవారం ఎర్రగడ్డ మనసిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. కలుషిత ఆహారం వల్ల 92 మంది మానసిక రోగులు అస్వస్థతకు గురవడం దురదృష్టకరమన్నారు. సోమ వారం వడ్డించిన ఆహారం వల్ల రోగులకు వాంతులు, వీరేచనాలు అవు తున్నా అధికారులు సరిగా స్పందించలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మానసిక రోగి కిరణ్‌ మృతిచెందాడన్నారు. ఘటన బాధ్యులైన ఆస్పత్రి సూపరిం టెండెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017మెంటల్‌ హెల్త్‌కేర్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad