Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు 

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు 

- Advertisement -

– పి దయాకర్ సిఐ పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ-గోవిందరావుపేట
: ఆంటీ ర్యాగింగ్ కమిటీల ఏర్పాటు ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పసరా పోలీస్ స్టేషన్ సిఐ పి దయాకర్ అన్నారు. సోమవారం మండలంలో చల్వాయి గ్రామంలోని కస్తూర్బ గాంధీ జూనియర్ కాలేజీ, చల్వాయి మోడల్ స్కూల్,  గోవిందరావు పేట జూనియర్ కాలేజీ ల లోని యువతకు ర్యాగింగ్ పై, మత్తు పదార్థాలపై,చెడు వ్యసనాలపై  ఆకర్షితులు కావద్దని పస్రా సి ఐ దయాకర్  అన్నారు. ఈ సందర్భంగా దయాకర్  మాట్లాడుతూ కాలేజీలో చదువుకునే సమయంలో సీనియర్లు,జూనియర్లు అని ర్యాగింగ్ చేసుకోరాదని అలాగే యువత గంజాయి వైపు మొగ్గు చూపరాదని మత్తు పదార్థాలకు బానిస కాకూడదని మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠ్యాంశాలు చెప్పే ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిస అవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని అలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరినారు. ఒకవేళ యువత ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పస్రా ఎస్ ఐ కమలాకర్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad