- Advertisement -

- – “నవతెలంగాణ” కథనంపై స్పందించిన ప్రభుత్వ కార్యదర్శి
– నివేదిక ఇవ్వాలని రజక ఫెడరేషన్ ఎండీకి అదేశాలు
– ప్రభుత్వ కార్యదర్శితో పాటు ఇతర అధికారులను కలిసిన రజక వృత్తి దారుల సంఘం నాయకులు - నవతెలంగాణ-బోడుప్పల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజక ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో కేటాయించిన స్థలంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నగర్ పేరిటా వెలసిన గుడిసెలు అనే శీర్షికతో మంగళవారం నాడు నవతెలంగాణ పత్రికలో ప్రచురితమైన కథనానికి బీసీ సంక్షేమ అధికారులు స్పందించారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల అశయ్య నేతృత్వంలో బృందం సభ్యులు బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఈ.శ్రీధర్ (ఐఏఎస్),బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి (ఐఏఎస్)లను కలిసి సమస్యను తెలియజేశారు అదే విధంగా నవతెలంగాణ పత్రికలో వచ్చిన కథనాన్ని చూపించడంతో స్పందించిన వారు జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రజక పేడరేషన్ ఎండీ చంద్రశేఖర్ కు ఆదేశాలు జారీ చేశారు. రజక ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కబ్జాకు ప్రయత్నించిన వారి వివరాలు, ఇంకా ఇతర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
- అదే విధంగా ఆత్మగౌరవ భవనం స్థలం పరిరక్షించేందుకు కావాల్సిన ఏర్పాట్లు తక్షణమే చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా భవనం నిర్మాణం కోసం కూడా కావాల్సిన ఏర్పాట్లు చూస్తామని హమీ ఇచ్చారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల అశయ్య మాట్లాడుతూ రజక ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు స్థానిక రాజకీయ నాయకులు కబ్జా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పేరుతో కాలనీ బోర్డు ఏర్పాటు చేశారని దీనిపై స్థానిక రెవెన్యూ,పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని వెంటనే స్థానిక అధికారులు రంగంలోకి దిగి గుడిసెలు తొలగించారని అన్నారు.ప్రభుత్వ కార్యదర్శి స్పందించి రక్షణ ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాడం సంతోషకరమైన అంశమని అన్నారు.అధికారులను కలిసిన వారిలో రజక వృత్తి దారుల సంఘం మేడ్చల్, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల కార్యదర్శులు జ్యోతి ఉపేందర్,ఎం.గోపాల్, సీ.మల్లేష్, మేడిపల్లి అధ్యక్షుడు అంబే చక్రపాణి, సోషల్ మీడియా కన్వీనర్ పి.భాస్కర్, ఉప్పల్ జోన్ కన్వీనర్ సట్టు రవి,రాష్ట్ర నాయకులు కాశయ్య,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -