Monday, July 7, 2025
E-PAPER
Homeసినిమాస్ట్రాంగ్‌ కంటెంట్‌కే ప్రాధాన్యత

స్ట్రాంగ్‌ కంటెంట్‌కే ప్రాధాన్యత

- Advertisement -

మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ‘బేబి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్నారు నిర్మాత ఎస్‌కేఎన్‌. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’, హిందీ ‘బేబి’తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్‌ మూవీస్‌ రాబో తున్నాయి. నేడు (సోమవారం) ఎస్‌కేఎన్‌ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘ఈ రోజుల్లో’ సినిమా సక్సెస్‌తో ప్రొడ్యూసర్‌గా నా జర్నీ మొదలైంది. నెక్ట్స్‌ మంత్‌ నుంచి హిందీ ‘బేబి’ చిత్రీకరణ ప్రారంభిస్తాం. జర్నలిస్ట్‌, పీఆర్‌ఓ, ప్రొడ్యూసర్‌..ఇలా నా కెరీర్‌ లోని ప్రతి దశను ఎంజారు చేశాను.
ఇండిస్టీలో ఒక పెద్దగా ఉన్న అల్లు అరవింద్‌ నాపై నమ్మకం పెట్టుకోవడం అనేది నా అదష్టం. నేను యూవీ క్రియేషన్స్‌తో, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో, గీతా ఆర్ట్స్‌తో, మైత్రీ వాళ్లతో కలిసి సినిమాలు చేస్తున్నానంటే అందుకు ఆయన ఇచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సాహామే కారణం.
నా స్నేహితుడు బన్నీవాస్‌కు కథపై మంచి జడ్జిమెంట్‌ ఉంటుంది. ఇప్పటి దాకా ఏడెనిమిది మంది తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేశాం. మరో ముగ్గురిని త్వరలో ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నాం. అలాగే వివిధ విభాగాల్లోనూ, లేడీ డైరెక్టర్స్‌ను కూడా పరిచయం చేస్తాం.
‘చెన్నై లవ్‌ స్టోరీ’ సెట్స్‌ మీద ఉంది. కష్ణ అనే ఒక టాలెంటెడ్‌ డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. అలాగే మరో కొత్త దర్శకుడు అవినాష్‌ను డైరెక్టర్‌గా ఓ ప్రాజెక్ట్‌ ప్రొడ్యూస్‌ చేయబోతున్నాం. అలాగే ‘రాజా సాబ్‌’ తర్వాత మారుతితో ఒక సినిమా, సాయి రాజేశ్‌తో మరో సినిమా చేయబోతున్నాం. ఆహాలో ‘త్రీ రోజెస్‌’ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
ప్రేక్షకుల్ని మెప్పించే ఒకే ఒక అంశం కంటెంట్‌. ఇప్పుడు మా నిర్మాణంలో ఉన్న ‘చెన్నై లవ్‌ స్టోరీ’తో పాటు మిగతా అన్ని ప్రాజెక్ట్స్‌లో స్క్రిప్ట్‌ ఎగ్జైట్‌ చేసి, స్ట్రాంగ్‌ కంటెంట్‌తో ఉన్నవే చేస్తున్నాం.
అల్లు అర్జున్‌ నుంచి నాకు మోరల్‌ సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుంది. ఏడాది న్నరలో రెండు చిత్రాలు చేయాలనేది అల్లు అర్జున్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -