Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Kamareddy : కామారెడ్డి సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు :మంత్రి కోమటిరెడ్డి

Kamareddy : కామారెడ్డి సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు :మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ జుక్కల్: 100 పడకల ఆసుపత్రి, ట్రామా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి. విద్యుత్ సరఫరా సజావుగా సాగేందుకు అవసరమైన సబ్ స్టేషన్ల నిర్మాణం పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలిలాభసాటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి.

మిషన్ భగీరథ అదనపు పైప్ లైన్ నిర్మాణ ప్రతిపాదనలు సమర్పించాలి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటించిన మంత్రి కొమటిరెడ్డి కామారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు , సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించి స్థానిక ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ళ సంజీవ్ రెడ్డి లతో కలిసి పలు రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పూల మొక్క అందజేసి జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ ఘన స్వాగతం పలికారు.

జుక్కల్ నియోజకవర్గం మద్దెలచెరువు – పిట్లం రోడ్,తిమ్మ నగర్ వద్ద 4 కోట్ల 86 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ ను మంత్రి ప్రారంభించారు. బిచ్కుంద నుంచి డోంగ్లీ వరకు 13 కోట్ల 20 లక్షల రూపాయలతో చేపట్టిన రొడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల పై కలెక్టర్, పలు ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగు నీటి ప్రాజెక్టులు, వైద్య ఆరోగ్య సేవలు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరా, అటవీ భూముల ఆక్రమణల, మహిళా సంఘాలకు రుణాలు వంటి పలు అంశాలను మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అనుగుణంగా అదనపు సబ్ స్టేషన్ లు నిర్మించాలని, వీటి నిర్మాణానికి అనువైన భూములను ఎంపిక చేసి ప్రతిపాదనలు సమర్పించాలని, డిప్యూటీ ముఖ్యమంత్రితో చర్చించి వెంటనే సబ్ స్టేషన్ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు.

నీటి పారుదల ప్రాజెక్టు సంబంధించి పెండింగ్ కాల్వ నిర్మాణ పనులు, అవసరమైన భూ సేకరణ పనుల పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పై నివేదిక అందించాలని అన్నారు. పెండింగ్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అవసరమైన ప్రతిపాదనలు జూలై 9 నాటికి అందిస్తే తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందుతుందని ఆయన తెలిపారు.కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ల బోర్డర్ రిమోట్ ఏరియా ఉందని, కావున ఇక్కడ 100 బెడ్ ల ఆసుపత్రికి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు.

జాతీయ రహదారి దగ్గర డ్రామా సెంటర్ అవసరం ఉందని, హైవే సమీపంలోని ఆసుపత్రిలో ట్రామా సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సన్న రకం ధాన్యం,కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటల సాగు పై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. సేంద్రియ వ్యవసాయం పెరిగే విధంగా చూడాలని ఎరువుల వాడకం తగ్గించాలని అప్పుడే భూసారం కాపాడుకోగలుగుతామని అన్నారు.వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ పకడ్బందీగా చేయాలని, వాస్తవ పరిస్థితులకు రికార్డులకు చాలా తేడా ఉంటుందని, భవిష్యత్తులో ఇలా జరగడానికి వీలు లేదని అన్నారు. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ యూనిట్ల పట్ల రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు.

డి.ఎం.ఎఫ్.టీ నిధులను ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలకు కొనుగోలు, పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పనకు వినియోగించాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు.త్రాగునీటి సమస్య లేకుండా అవసరమైన అదనపు పైప్ లైన్, బోర్ వెల్స్ పనులకు సర్వే నిర్వహించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు దశల వారిగా అర్హులందరికీ అందుతాయని అన్నారు. జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు త్వరగా గ్రౌండ్ చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అన్నారు. 5 లక్షల రూపాయల 4 దశలలో లబ్ధిదారుల ఖాతాలలో గ్రీన్ ఛానల్ ద్వారా జమ చేయడం జరుగుతుందని అన్నారు.

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లక్షల మేరకు అందించాలని మంత్రి తెలిపారు. జిల్లాలో తదుపరి అటవీ భూముల ఆక్రమణ జరగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఇబ్బందులు కలిగించ వద్దని అన్నారు. అటవీ ప్రాంతంలో పాత రోడ్డు మరమ్మత్తు, పునః నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. మంత్రి ఆదేశాల మేరకు ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదన సమర్పిస్తామని అన్నారు. ప్రభుత్వ ఆలోచన ప్రకారం మహిళా సంఘాల ద్వారా క్యాంటీన్ పెట్రోల్ బంక్ రైస్ మిల్ వంటి ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, జిల్లా అధికారులు , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -