Saturday, May 24, 2025
Homeరాష్ట్రీయంచురుగ్గా సాగుతున్న నైరుతిపవనాలు

చురుగ్గా సాగుతున్న నైరుతిపవనాలు

- Advertisement -

– నేడు అండమాన్‌ నికోబార్‌ దీవులకు..
– ఈ ఏడాది కేరళను ముందే తాకే అవకాశం
– రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు వర్షాలు
– రేపు, ఎల్లుండి పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ఏడాది ముందే కేరళను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. మే చివరి వారంలోనే కేరళను తాకే అవకాశముందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. మంగళవారం దక్షిణ అండమాన్‌ సముద్రం, అండమాన్‌-నికోబార్‌ దీవులు, ఆగేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. మరో వైపు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం ఎండ, ఉక్కపోత తీవ్రంగా ఉంటున్నాయి. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో 14, 15 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు(గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పడే సూచనలున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆ రెండు రోజుల పాటు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. సోమవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 30కిపైగా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచాయి. రాష్ట్రంలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఉక్కపోత మాత్రం తీవ్రస్థాయిలో ఉంటున్నది. రాష్ట్రంలో ఖమ్మంలో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
ఖమ్మం 41.8 డిగ్రీలు
మెదక్‌ 40.6 డిగ్రీలు
నల్లగొండ 40.5 డిగ్రీలు
రామగుండం 40.5 డిగ్రీలు
ఆదిలాబాద్‌ 40.3 డిగ్రీలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -