Friday, January 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబలమైన తుఫాను..ఒక్కసారిగా నేలకూలిన స్టాట్యూ అఫ్ లిబర్టీ

బలమైన తుఫాను..ఒక్కసారిగా నేలకూలిన స్టాట్యూ అఫ్ లిబర్టీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బ్రెజిల్‌ని బలమైన తుఫాను అతలాకుతలం చేసింది. బలమైన గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గాలుల తీవ్రత అధికంగా ఉంది. ఈ గాలుల తీవ్రతకు మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని పోర్టో అలెగ్రే సమీపంలో గల గువైబా నగరంలో ఉన్న స్టాట్యూ అఫ్ లిబర్టీ విగ్రహం ఒక్కసారిగా నేలకూలిపోయింది.

దాదాపు 24 మీటర్ల పొడవున్న ఈ విగ్రహం హవాన్‌ రిటైల్‌ దుకాణంలోని పార్కింగ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అయితే, బలమైన గాలులకు అది ఒక్కసారిగా కూలి పార్కింగ్‌ ప్లేస్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విగ్రహం కూలుతున్న దృష్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక తుఫాన్ సమయంలో గాలి వేగం గంటకు 90 కిలోమీటర్లకు మించి నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. మెట్రోపాలిటన్ ప్రాంతమంతా తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -