Student commits suicide
నవతెలంగాణ మంచిర్యాల: :హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని మృతి చెందిన ఘటన మంచిర్యాల లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం లోని బైపాస్ రోడ్ లో గల మిమ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మిడిఎట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా కొత్తపెల్లి సహస్ర మంగళవారం సాయంత్రం హాస్టల్ బిల్డింగ్ మూడవ అంతస్తూ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు హాస్టల్ సిబ్బంది పట్టణం లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అత్యవసర చికిత్స మేరకు కరీంనగర్ కు తరలించి చికిత్స అందించే క్రమం లో సహస్ర మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతికి గల కారణాల పై విచారణ చేపట్టారు. బిల్డింగ్ కు ఎటువంటి రక్షణ చర్యలు లేవని, గ్రిల్స్ లేకుండా ఏర్పాటు చేసిన కిటికీలో నుంచి విద్యార్థిని దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.అట్టి బిల్డింగ్ లో హాస్టల్, కళాశాల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని డిఐఈవో అంజయ్య స్పష్టం చేశారు.